Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికలు పెడదామా.. రాజకీయా పార్టీల అభిప్రాయం కోరిన ఈసీ, హుజురాబాద్ బైపోల్ ఇప్పట్లో లేనట్లేనా..?

కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈసీ కోరింది. ఈ నెల 30 లోపు అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది. 
 

election commission letter to political parties for conducting of elections
Author
Hyderabad, First Published Aug 12, 2021, 5:44 PM IST

కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈసీ కోరింది. ఈ నెల 30 లోపు అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది. దేశంలో చాలా ఉప ఎన్నికలు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు పెండింగ్‌లో వున్నాయని తెలిపింది. ఈ లేఖలో ఈ నెలలో హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశాలు లేనట్లేనని తెలుస్తోంది. కాగా, భూ కబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బహిష్కరించారు. అనంతరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఈటల. ఈ  నేపథ్యంలోనే హుజురాబాద్‌లో ఉప ఎన్నికల అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలు అక్కడ ఇప్పటి నుంచే ప్రచారం మొదలెట్టాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios