హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ స్థానానికి మంగళవారం నాడు నోటిఫికేషన్ జారీ అయింది. జూన్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలన్ని వెల్లడించనున్నారు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా  గతంలో మైనంపల్లి హనుమంతరావు కొనసాగారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధిగా మైనంపల్లి హన్మంతరావు పోటీ చేసి విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు  ఎమ్మెల్సీ పదవికి  రాజీనామా చేశారు.   దీంతో ఈ స్థానానికి ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు నోటీఫికేషన్‌‌ జారీ అయింది.  జూన్ 7వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితం వెలువడనుంది.