దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో జూలై వరకు ఎన్నికల పండగ జరగనుంది. ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిశాక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు.

పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన 127కి పిటిషన్లను హైకోర్టు రెండు రోజుల క్రితం కొట్టివేయడంతో పురపాలక సంఘాల ఎన్నికలకు రూట్ క్లియర్ అయ్యింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లను ఆరంభించింది.

మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మే నెలలో ఎంపీటీసీ ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.

అయితే మే 23న లోక్‌సభ ఫలితాలు వెలువడుతుండటంతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలను జూన్, జూలై‌ నెలల్లో జరగవచ్చు. అనంతరం సహకార ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది.