రేపే హైద్రాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనం: సర్వం సిద్దం, 40 వేల మందితో పోలీస్ బందోబస్తు


హైద్రాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ సహా నగరంలోని  పలు ప్రధాన చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.
 

Elaborate arrangements for Ganesh immersion in Hyderabad lns

హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనానికి  రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల  28వ తేదీన హైద్రాబాద్ నగరంలోని ప్రధాన చెరువులు, కొలనుల్లో  వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. హైద్రాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో  వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం  ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

 హైద్రాబాద్ నగరంలోని ప్రధాన చెరువుల్లో వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం  భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో  సుమారు 40 వేలకు మంది  పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.  19 కిలోమీటర్ల పాటు  గణేష్ విగ్రహాల శోభాయాత్ర సాగనుంది.  బాలపూర్ నుండి హుస్సేన్ సాగర్ వరకు  వినాయక విగ్రహాల శోభాయాత్ర సాగనుంది. బాలపూర్ గణేష్ విగ్రహాం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుంది.వినాయక విగ్రహాల శోభాయాత్రలో ఖైరతాబాద్  వినాయక విగ్రహాం ప్రధానమైంది. 

వినాయక విగ్రహాల శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  అధికారులు ఏర్పాట్లు చేశారు.  హుస్సేన్ సాగర్,  సరూర్ నగర్, సఫిల్ గూడ, కాప్రా,నల్లచెరువు, ఎదులాబాద్ లలోని చెరువుల్లో  వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రధానంగా కొనసాగుతుంది.  హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25,694 మంది, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో  6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. మరో వైపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో  మరో ఐదు వేలకు పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటారు. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు  125 స్పెషల్ ప్లాటూను  పోలీస్ సిబ్బంది కూడ విధులు నిర్వహించనున్నారు.

వినాయక విగ్రహాల శోభాయాత్ర సాగే మార్గంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.  అంతేకాదు అంబులెన్స్ లను కూడ సిద్దంగా ఉంచారు. మరో వైపు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడ  వైద్య శిబిరాలు,  మంచినీటి  ప్యాకెట్లను సిద్దం చేశారు.  పది లక్షలకు పైగా మంచినీటి ప్యాకెట్లను సిద్దం చేసింది జీహెచ్ఎంసీ. ప్రతి విగ్రహానికి  పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.  ప్రతి వినాయక విగ్రహానికి నెంబర్ కేటాయించారు. 

మరో వైపు పోలీస్ కమాండ్ సెంటర్ నుండి  అన్ని శాఖల అధికారులు  నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు.ఇదిలా ఉంటే  వినాయక విగ్రహా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా  3 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.అంతేకాదు ఆయా ప్రాంతాల్లో  నిమజ్జనం కోసం క్రేన్లను ఏర్పాటు చేశారు.సుమారు 400 మంది గజ ఈతగాళ్లను కూడ సిద్దంగా ఉంచారు. వినాయక విగ్రహాల శోభాయాత్రను పురస్కరించుకొని  రేపు, ఎల్లుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు.  శోభాయాత్ర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా  బస్సులను నడపనుంది.  535 బస్సులను శోభాయాత్ర కోసం ఏర్పాటు చేసినట్టుగా ఆర్టీసీ ప్రకటించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios