కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరిపోయారు. ఇవాళ టీఆర్ఎస్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పలువరు కాంగ్రెస్ నాయకులతో కలిసి సురేష్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే ఈ సభకు అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడం ప్రజల్లోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ పలు అనుమానాలు రేకెత్తాయి.  అయితే సీఎం ఈ సభకు ఎందుకు రాలేదో మంత్రి ఈటల వివరించారు.

ఇటీవల జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆర్టీసి బస్సు ప్రమాదానికి గురై దాదాపు 60 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనతో కేసీఆర్ తీవ్ర ఆవేధనకు గురయ్యారని ఈటల పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఈ సభకు హజరుకాకున్నా పరవాలేదని స్వయంగా సురేష్ రెడ్డే చెప్పడంతో కేసీఆర్ రాలేదని ఈటల వివరించారు. 

సురేష్ రెడ్డి లాంటి వ్యక్తి స్పీకర్ గా వున్న అసెంబ్లీలో తాము ఎమ్మెల్యేలుగా ఉండటం అదృష్టమన్నారు ఈటల. అతడు స్పీకర్ గా వున్న సమయంలో కూడా తెలంగాణ వాదానికి మద్దతు పలికారని ఈటల గుర్తు చేశారు. సురేష్ రెడ్డి చేరికతో నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ మరింత బలిపడిందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.