పెద్ద అంబర్ పేట్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ వార్తా పత్రిక ఈనాడు సంస్థకు చెందిన ఉద్యోగులు వెళ్తున్న బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఈనాడు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 12మంది గాయపడగా.... వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని అమ్మ హాస్పిటల్ కి తరలించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉద్యోగం ముగించుకొని ఇంటికి వస్తుండగా... ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.