హైదరాబాద్: ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఎంబీఎస్ జ్యూయలరీస్ సంస్థకు రూ. 222 కోట్ల భారీ జరిమానాను విధించింది.

ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ జరిమానా విధించినట్టుగా ఈడీ తెలిపింది. ఎంబీఎస్ సంస్థ డైరెక్టర్ సుఖేష్ గుప్తా కు వ్యక్తిగతంగా రూ. 22 కోట్లు ఫైన్ కట్టాలని ఈడీ ఆదేశించింది.

ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశీ సంస్థతో లావాదేవీలు చేసినందుకు గాను ఈడీ జరిమానా విధించింది.హాంకాంగ్ కు వజ్రాలను ఎగుమతి చేయడంలో ఫెమా నిబంధనలను ఎంబీఎస్ సంస్థ ఉల్లంఘించిందని ఈడీ ఆరోపించింది.

ఎంబీఎస్ జ్యూయలరీస్ సంస్థ  డైరెక్టర్ సుఖేష్ గుప్తా రూ. 216 కోట్ల విలువైన మినరల్స్ ట్రేడింగ్ కార్పోరేషన్ తో సంబంధంలో నిందితుడుగా ఉన్నాడని ఈడీ తెలిపింది.

2013లో హాంకాంగ్ కు చెందిన ఫాయ్ అనే సంస్థకు రూ. 220 కోట్ల డైమండ్స్ ను ఎగుమతి చేసినట్టుగా సుఖేష్ గుప్తా ఒప్పుకొన్నాడని ఈడీ ప్రకటించింది.తనకు హాంకాంగ్ లోని ఫాయ్ కంపెనీ నుండి డబ్బులు రావాల్సి ఉందని.. ఆ డబ్బులు వస్తే మెటల్స్ మినరల్స్ ట్రేడింగ్ కార్పోరేషన్ కు పడిన బకాయిలను తీరుస్తానని ఆయన గతంలోనే కోర్టుకు తెలిపాడు.ఫాయ్ కూడ ఈడీ కంపెనీ నిఘాలో ఉంది. ఈ కంపెనీకి మూడు కంపెనీలు వజ్రాల ఎగుమతల విషయమై ఈడీ ఆరా తీస్తోంది.