Asianet News TeluguAsianet News Telugu

రూ.3 వేల కోట్ల గోల్‌మాల్: కార్వీ సంస్థల్లో ఈడీ సోదాలు

 కార్వీ సంస్థలో రూ. 3 వేల  కోట్ల నిధుల గోల్ మాల్ పై  ఈడీపై అధికారులు సోదాలు చేస్తున్నారు. కార్వీకి అనుబంధంగా ఉన్న 16 సంస్థల్లో కూడ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
 

ED searches on karvy offices in Hyderabad
Author
Hyde Park, First Published Sep 22, 2021, 12:42 PM IST

హైదరాబాద్: కార్వీ (karvy)కేసులో ఈడీ Enforcement directorate) విస్తృతంగా సోదాలు చేస్తోంది. కార్వీకి అనుబంధ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తోంది. బుధవారం నాడు కార్వీకి అనుబంధంగా 16 సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కార్వీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న పది అనుబంధ సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కార్వీ సంస్థపై ఈడీ  ఇప్పటికే  కేసు నమోదు చేసిన విషయం తెలిసిదే.

 కార్వీ చైర్మన్ పార్థసారథిని ఇప్పటికే మూడు రోజుల పాటు విచారించింది ఈడీ. మూడు వేల కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్ పై ఈడీ అధికారులు  ఆరా తీయనున్నారు. కార్వీపై ఇప్పటికే సీసీఎస్‌లో  ఐదు కేసులు నమోదు నమోదు అయ్యాయి. పార్థసారథి ఇంటితో పాటు ఇప్పటికే అరెస్టయిన ఐదుగురు ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios