తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజ్‌ల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని మెడికల్ కాలేజ్‌ల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. కామినేని, ఎస్వీఎస్‌లతో మొత్తం ఆరు మెడికల్ కాలేజ్‌ల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌పై ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ కార్యాలయాలు, కాలేజ్ బ్రాంచ్‌లలో కూడా సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్వీఎస్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
మరోవైపు కామినేని మెడికల్ కాలేజ్‌కు సంబంధించిన ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక, కరీంనగర్‌లోని ఓ వైద్య కళాశాలలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
