Asianet News TeluguAsianet News Telugu

మాదాపూర్‌లోని అనూస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

హైదరాబాద్ మాదాపూర్‌లోని అనూస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈడీ సోదాలు ముగిశాయి. రాబీస్ డిస్టలరీస్‌తో మరో రెండు కంపెనీలు రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తోంది. నలుగురు ఈడీ అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది. 

ed raids end in anus headquarters in hyderabad
Author
First Published Sep 16, 2022, 7:22 PM IST

హైదరాబాద్ మాదాపూర్‌లోని అనూస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈడీ సోదాలు ముగిశాయి. దాదాపు పది గంటల పాటు తనిఖీలు జరిగాయి. అనూస్ డైరెక్డర్ అభిషేక్‌తో పాటు బంధువుల ఇళ్లపైనా దాడులు జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని అనూస్ పార్లర్స్ ఆర్ధిక లావాదేవీలకు మాదాపూర్‌లోని అనూస్ ప్రధాన కార్యాలయంగా తెలుస్తోంది. అనూస్ బ్యూటీపార్లర్ అడ్రస్‌పై మూడు కంపెనీలు రిజిస్టర్ అయినట్లుగా గుర్తించిన ఈడీ.. ఆర్‌వోసీలో రిజిస్టర్ అయిన డేటా ఆధారంగా అనూస్‌లో సోదాలు చేపట్టింది. రాబీస్ డిస్టలరీస్‌తో మరో రెండు కంపెనీలు రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తోంది. నలుగురు ఈడీ అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది. అనూస్ డైరెక్టర్‌గా అభిషేక్ బోయిన్‌పల్లి వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇకపోతే...  ఢిల్లీ లిక్కర్ స్కాంలో 12 మందికి ఈడీ అధికారులు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఇవాళ ఈడీ అధికారులు 40 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ స్కాంతో సంబంధం ఉందనే అనుమానాలతో  ఈడీ అధికారులు ఇవాళ  18 కంపెనీలతో పాటు 12 మంది కి నోటీసులు ఇచ్చారు.  అరుణ్ రామచంద్రన్ పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్ పల్లి, బుచ్చిబాబు, చందన్ రెడ్డి, పెరమన్ రిచర్డ్, విజయ్ నాయర్ ,దినేష్ ఆరోరా, వై. శశికళ,  రాఘవ మాగుంట, సమీర్ మహేంద్ర తదితరులకు నోటీసులు ఇచ్చారు. 

ALso REad:ఢిల్లీ లిక్కర్ స్కాం: 12 మంది సహ 18 కంపెనీలకు ఈడీ నోటీసులు

ఇండో స్పిరిట్స్, మాగుంటి ఆగ్రోఫామ్స్, ట్రైడెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ ఆవంతిక కాంట్రాక్టర్స్ , ఆర్గానామిక్స్ ఈకో సిస్టమ్స్ లిమిటెడ్, అరబిందో ఫార్మా, పిక్సీ ఎంటర్ ప్రైజెస్, ఎన్రికా ఎంటర్ ప్రైజెస్, ప్రీనీస్ ఎంటర్ ప్రైజెస్, జైనాబ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బాలాజీ డిస్టిలరీస్, టెక్రా, ఫెరల్ డిస్టిలరిస్, హివిడే ఎంటర్ ప్రైజెస్, వైకింగ్ ఎంటర్ ప్రైజెస్, డైయాడిమ్ ఎంటర్ ప్రైజెస్, డిప్లొమాట్ ఎంటర్ ప్రైజెస్, పెగాసస్ ఎంటర్ ప్రైజెస్, రాబిన్ డిస్టిలరిస్ లకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios