బీఆర్ఎస్ నేత, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెందిన మెడికల్ కాలేజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం దాడులు చేశారు

బీఆర్ఎస్ నేత, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెందిన మెడికల్ కాలేజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం దాడులు చేశారు. మల్లారెడ్డి కాలేజ్ సహా తెలంగాణ వ్యాప్తంగా వున్న పది వైద్య కళాశాలల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బొమ్మకల్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటీ మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలు వున్నాయి. ఈ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. అలాగే సీట్ల భర్తీలో భారీగా హావాలా లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఈడీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.