చంచల్‌గూడ జైలుకు ఈడీ బృందం.. ప్రత్యేక గదిలో నందకుమార్ విచారిస్తున్న అధికారులు..
ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఈడీ అధికారులు.. ప్రత్యేక గదిలో నందకుమార్ విచారిస్తున్నారు.

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఈడీ అధికారులు.. ప్రత్యేక గదిలో నందకుమార్ విచారిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లు సుమిత్ గోయల్, దేవేంద్ర కుమార్ సింగ్, మరో అధికారి నందకుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. నందకుమార్‌ను విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఇక, బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి కుటుంబసభ్యులకు, నందకుమార్‌కు మధ్య లావాదేవీలు జరిగాయని అనుమానిస్తున్న ఈడీ అధికారులు.. నందకుమార్‌ను విచారించేందుకు కోర్టు అనుమతి పొందిన సంగతి తెలిసిందే.
7 హిల్స్ మాణిక్‌చంద్ ఉత్పత్తుల వ్యాపారి అభిషేక్ అవలాను ఇటీవల ఈడీ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోదరుడు రీతేష్‌రెడ్డి, నంద కుమార్‌లతో వ్యాపార సంబంధాల గురించి అతడు అధికారులు చెప్పినట్టుగా ప్రచారం సాగుతుంది.
ఈ కోణంలోనే ఈడీ అధికారులు నంద కుమార్‌ను విచారిస్తున్నారు. ఇక, ఇందుకు సంబంధించిన అనుమానిస్తున్న మనీలాండరింగ్ లింకులపై మరికొందరు వ్యాపారవేత్తలకు ఈడీ నోటీసులు అందజేసే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల ఈడీ అధికారులు రోహిత్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. రోహిత్ రెడ్డికి సంబంధించిన పాన్, ఆధార్, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల వివరాలను ఈడీ సేకరించింది.