Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు షాక్: సమన్లు జారీ చేసిన ఈడీ

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. 
 

ED issues summons to TRS MP Nama Nageswara rao lns
Author
Khammam, First Published Jun 16, 2021, 12:41 PM IST

హైదరాబాద్: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.  ఐదు రోజుల క్రితం ఈడీ అధికారులు  దేశంలోని ఏడు చోట్ల సోదాలు నిర్వహించారు.  

రూ. 1064 కోట్ల బ్యాంక్ నిధుల కుంభకోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.నామా నాగేశ్వరరావు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు ఆయన ఇంట్లో కూడ  ఐదు రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వాటిని విదేశీ కంపెనీలకు నిధులను మళ్లించారిని ఆయనపై అభియోగాలున్నాయి.

&

nbsp;

 

2019 లో సీబీఐ అధికారులు నామా నాగేశ్వరరావు కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2020లో రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ తో పాటు డైరెక్టర్లపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది.మధుకాన్ ప్రాజెక్టు, మధుకాన్ ఇన్ ఫ్రా ,మధుకాన్ టాలీ హైవే అధారిటీ తదితరులపై ఎఫ్‌ఐఆర్ లో చేర్చింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకులు ఈ కంపెనీలకు రూ. 1151 కోట్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.  ఈ నిధుల ద్వారా రాంచీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసం వినియోగించాలని తలపెట్టారు. 

అయితే ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో పురోగతి లేదని సీబీఐ ఆరోపించింది. అంతేకాదు రూ. 1029 కోట్లు దుర్వినియోగం అయ్యాయని సీబీఐ ప్రాథమిక నిర్ధారించింది. ఈ లోన్ నాన్ ఫెర్మారింగ్ అసెట్ గా మారిందని 2018లో సీబీఐ తెలిపింది. 2019లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రాంచీ ఎక్స్ ప్రెస్ వే నుండి ఈ కంపెనీని తొలగించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios