Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం .. సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ, అందులో 12 మంది పేర్లు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇందులో 12 మంది పేర్లను ప్రస్తావించింది. దీనికి సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు రేపు న్యాయస్థానానికి వివరించనున్నారు.

ed files supplementary chargesheet against 12 people in delhi liquor policy scam
Author
First Published Jan 6, 2023, 8:46 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). 13567 పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ ఇందులో 12 మంది పేర్లను ప్రస్తావించింది. ప్రధానంగా సౌత్ గ్రూప్ నుంచి జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల ఆధారాలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్‌పల్లి, బినయ్ బాబు, విజయ్ నాయర్, అమిత్ అరోరా, దినేష్ అరోరా, కుల్‌దీప్,నరేంద్ర సింగ్ ప, గౌతమ్, అరుణ్ పిళ్లైతో పాటు సమీర్ కంపెనీల్ని ఈడీ ప్రస్తావించింది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌లోనూ ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా పేరు చేర్చకపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రేపు న్యాయస్థానానికి వివరించనున్నారు.

ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు,విజయ్ నాయర్,అభిషేక్ బోయినపల్లిలకు గతంలో కోర్టు విధించిన రిమాండ్ జనవరి 2తో ముగిసింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుల కస్టడీని పెంచాలని కోరుతూ సీబీఐ  కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. దీంతో నిందితుల జ్యుడీషియల్ రిమాండ్ గడువును న్యాయస్థానం ఈ నెల 7 వరకు పొడిగించింది. 

Also REad: ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ చార్జీషీట్ లో హైద్రాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు

ఇక, ఈ కేసులో ఇప్పటికే ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు‌ పాత్రపై ఈడీ అధికారులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈడీ అధికారులు.. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి‌లతో పాటు తదితరుల పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios