ఈఎస్ఐలో రూ. 211 స్కాం: చార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ

ఈఎస్ఐ స్కాంపై  ఈడీ అధికారులు చార్జీషీట్ దాఖలు చేశారు రూ. 211 కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ అధికారులు  తేల్చారు.
 

ED files chargesheet in Rs 211 crore Insurance Medical Services fraud lns

హైదరాబాద్: ఈఎస్ఐ స్కాంపై  ఈడీ చార్జీషీట్ దాఖలు చేసింది.  రూ. 211  కోట్ల స్కాం జరిగిందని ఈడీ అధికారులు నిర్ధారించారు.  ఈఎస్ఐ స్కాంలో  మాజీ డైరెక్టర్  దేవికారాణితో పాటు  మరో ఏడుగురు ఉద్యోగుల పాత్రను  అధికారులు ప్రస్తావించారు. 

ఈఎస్ఐలో మందులు, మెడికల్ పరికరాల కొనుగోలులో  గోల్ మాల్ జరిగిందని  ఏసీబీ  కేసు నమోదు చేసింది.ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు  దర్యాప్తును ప్రారంభించారు.  ఈ కేసులో ఇప్పటికే నిందితులకు చెందిన రూ. 144 కోట్ల ఆస్తులు అటాచ్డ్ చేసిన విషయం తెలిసిందే.

ఈఎస్ఐ మాజీ డైరెక్టర్  దేవికారాణి,ఇతర అధికారులతో కుమ్మక్కై స్కాంకు పాల్పడినట్టుగా చార్జీషీట్ లో ఈడీ అధికారులు ప్రస్తావించారు.
ఈఎస్ఐ కు  మందులు, మెడికల్ పరికరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఈడీ ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బినామీ కంపెనీల పేరుతో మందులు, మెడికల్ పరికరాలు సరఫరా చేశారని  తేల్చింది.

మందులు, మెడికల్ పరికరాల ధరలను మార్కెట్ ధర కంటే  ఎక్కువగా కోడ్ చేసినట్టుగా  దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. చార్జీషీట్ లో ఈడీ ఈ అంశాన్ని ప్రస్తావించింది.ఐఎంఎస్  జాయింట్ డైరెక్టర్ గా గతంలో పనిచేసిన డాక్టర్ పద్మ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి  మందులు సరఫరా చేసినట్టుగా తప్పుడు బిల్లులు  సృష్టించినట్టుగా  అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఈడీ చార్జీషీట్ లో ప్రస్తావించింది.

ఈఎస్ఐ స్కాంలో  అవకతవకలకు  పాల్పడిన  నిధులతో  దేవికా రాణితో పాటు ఇతర ఉద్యోగులు  బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్టుగా  దర్యాప్తు సంస్థలు తేల్చాయి.దేవికారాణితో పాటు  ఫార్మసిస్ట్ నాగలక్ష్మి  రూ. 6.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారని  ఈడీ గుర్తించింది. 2015-16, 2018-19 మధ్యకాలంలో  ఈ కుంభకోణం జరిగిందని ఈడీ  అధికారులు చార్జీషీట్ లో  ప్రస్తావించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios