Asianet News TeluguAsianet News Telugu

ఫెమా నిబంధనల ఉల్లంఘన.. హైదరాబాద్‌లోని ఆల్ఫాజియో ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ హైదరాబాద్‌కు చెందిన ఆల్ఫాజియో కంపెనీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది

ED attaches assets worth Rs 16 crore belonging to Alphageo company
Author
First Published Nov 23, 2022, 3:54 PM IST

హైదరాబాద్‌లోని ఆల్ఫాజియో ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈ మేరకు ఆ కంపెనీ ఆస్తులను బుధవారం ఈడీ అటాచ్ చేసింది. ఆయిల్ కంపెనీల్లో ఆల్ఫాజియో భూగర్భ సర్వేలు చేస్తోంది. ఈ సంస్థ భూసర్వే నిర్వహణ కోసం విదేశాల నుంచి భారీగా సామాగ్రిని దిగుమతి చేసుకుంది. దిగుమతి చేసుకున్న సామాగ్రికి హవాలా రూపంలో చెల్లింపులు చేసినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆల్ఫాజియోకు చెందిన రూ.16 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios