కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు.. 5.2 కోట్ల నిధుల బదిలీపై వివరణ ఇవ్వాలని ఆదేశం..

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి తన కుటుంబానికి చెందిన కంపెనీ నుంచి మునుగోడులోని పలువురికి రూ. 5.2 కోట్లను బదిలీ చేయడంపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ECI notice to Komatireddy Raj Gopal Reddy on Rs 5 2 crore funds transfer

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి తన కుటుంబానికి చెందిన కంపెనీ నుంచి మునుగోడులోని పలువురికి రూ. 5.2 కోట్లను బదిలీ చేయడంపై వచ్చిన ఆరోపణలపై అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటలలోపు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. వివరాలు.. రాజగోపాల్ రెడ్డి  కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనికంగ్ కంపెనీ లిమిటెడ్ ఖాతాల నుంచి 23 మంది ఖాతాలకు రూ. 5.2 బదిలీ చేశారని టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ శనివారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 14, 18, 29 తేదీల్లో ఈ నగదు బదిలీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నగదుతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని ఆరోరపించారు. 

టీఆర్ఎస్ నుంచి ఫిర్యాదును స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. ‘‘ఆరోపించిన విధంగా ఈ బదిలీని మీరు లేదా మీ ఆదేశాల మేరకు కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ ద్వారా జరిగితే.. 23 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడిన ఈ ఫండ్ ఓటరు ప్రేరేపణ కోసం ఉపయోగించబడకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఇది అవినీతి పద్ధతి’’అని ఈసీ నోటీసులో పేర్కొంది.

అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటలలోగా టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదులోని అంశాలపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం నోటీసుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించి మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం పంపింది. 

ఇదిలా ఉంటే.. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios