మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై వేటు:మిర్యాలగూడ ఆర్డీఓకు ఆర్ఓ బాధ్యతలు

మునుగోడు ఉప  ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై ఎన్నికలసంఘం వేటు వేసింది. మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్ కు రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించింది ఈసీ.
 

ECI Appoints Miryalaguda RDO As Munugode Bypoll 2022 Returning officer

నల్గొండ:మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై ఎన్నికల సంఘం వేటు వేసింది.  మిర్యాలగూడ  ఆర్డో వో  రోహిత్ సింగ్ కు రిటర్నింగ్ అధికారి బాధ్యతలను కేటాయించింది ఈసీఐ.

మునుగోడు అసెంబ్లీ  స్థానంలో పోటీలో ఉన్న అభ్యర్ధులకు గుర్తుల  కేటాయింపులో  మునుగోడు రిటర్నింగ్  అధికారి వ్యవహరించిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ నెల 17న అభ్యర్ధులకు గుర్తుల కేటాయించాల్సి ఉంది. అయితే  కొన్ని గుర్తులపై ఈసికి టీఆర్ఎస్  ఫిర్యాదు చేసింది.దీనికి తోడు  హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ కారణాలతో గుర్తుల కేటాయింపును ఈ నెల 18న చేసినట్టుగా  రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు మీడియాకు చెప్పారు. కారు గుర్తును పోలిన కొన్ని గుర్తులపై ఈసీఐ  గతంలోనే  ఇచ్చిన ఆదేశాల  ఆధారంగా రోడ్డు రోలర్  గుర్తును శివకుమార్ కు కేటాయించలేదని రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు. 

 గుర్తుల కేటాయింపు సమయంలో రోడ్డు రోలర్ గుర్తు యుగతులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ కు లాటరీలో దక్కింది. అయితే  ఈ గుర్తును శివకుమార్ కు  కేటాయిస్తున్నట్టుగా తనతో సంతకం కూడా  తీసుకున్నారని ఆయన చెప్పారు. అయితే  తనకు ఈ గుర్తు కాకుండా మరో గుర్తును కేటాయించారన్నారు. ఈ విషయమై  శివకుమార్ ఈసీఐకి పిర్యాదు చేశారు.  దీంతో కేంద్ర ఎన్నికల డిప్యూటీ  కమిషనర్  హైద్రాబాద్ కువచ్చారు. ఈ విషయమై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ కు శివకుమార్ సహా  మరికొందరు ఫిర్యాదులు చేశారు. దీంతో విచారణ నిర్వహించిన ఈసీ శివకుమార్ కు  రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయమై కేంద్ర  ఎన్నికల  డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ గురువారంనాడు  విచారణ  నిర్వహించారు.గుర్తుల  కేటాయింపు  విషయమై ఏం జరిగిందనే దానిపై ఆర్ఓను విచారించారు. ఎన్నికల డిప్యూటీ కమిషనర్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం  చెప్పినట్టుగా  రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు మీడియాకు వివరించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో  విచారణ  చేసిన  తర్వాత కొత్త రిటర్నింగ్  అధికారి నియామకం కోసం  ముగ్గురు అధికారుల పేర్లను పంపాలని  ఈసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.రాష్ట్ర  ప్రభుత్వం పంపిన ముగ్గురి పేర్లలో మిర్యాలగూడ ఆర్ డీ ఓ రోహిత్ సింగ్ కు రిటర్నింగ్ బాధ్యతలను అప్పగించారు.

2011 లోనే రోడ్డు రోలర్ ఎన్నికల గుర్తును ఎన్నికల  సంఘం తొలగించిందని టీఆర్ఎస్ గుర్తు చేస్తుంది.  ఈ గుర్తును తిరిగి కేటాయించడం  వెనుక ఉద్దేశ్యం ఏమిటని టీఆర్ఎస్ ప్రశ్నించింది.మునుగోడులో  ఓటమి భయంతోనే రోడ్డు రోలర్  గుర్తును బీజేపీ  తీసుకువచ్చిందని కేటీఆర్  విమర్శించారు. 

also read:ఈసీ తీరు ఆక్షేపణీయం:మునుగోడు ఆర్ఓ బదిలీపై కేటీఆర్

కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించవద్దని ఈసీని  టీఆర్ఎస్ కోరింది. ఈ గుర్తుల వల్ల తమ పార్టీ అభ్యర్ధుల విజయావకాశాలు దెబ్బతింటాయని టీఆర్ఎస్ చెబుతుంది. ఇదే విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  వికాస్  రాజు కి  వినతి  పత్రం  సమర్పించారు. అయితే ఈ విషయమై సరైన స్పందన లేదని హైకోర్టులో  పిటిషన్  దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను హైకోర్టు కోట్టి వేసింది.

కారు గుర్తును పోలిన రోడ్డురోలర్, కెమెరా, చపాతి రోలర్, డాలీ, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను ఎన్నికల గుర్తుల జాబితా నుండి తొలగించాలని టీఆర్ఎస్  కోరింది.ఇదే  డిమాండ్ తో గతంలో కూడ ఈసీఐకి  కూడా  టీఆర్ఎస్ వినత పత్రం సమర్పించింది. నిన్న కూడ టీఆర్ఎస్ బృందం  ఈసీఐని కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే శివకుమార్ కు  రోడ్డు రోలర్ గుర్తును ఈసీ కేటాయించింది. రోడ్డు రోలర్ గుర్తు ప్రభావం టీఆర్ఎస్ విజయావకాశాలపై ఏ మేరకు ప్రభావం  చూపుతుందోననేది వచ్చే నెల 6న తేలనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios