వరంగల్: తలుపులు, తాళాలు పగులగొట్టి ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ నర్సంపేటలోని కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టింది. ఈ సంఘటన గురువారంనాడు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెసు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురై సతీష్ అనే అధికారిని నిర్బంధించారు. అతన్ని విడిపించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. 

నర్సంపేట పట్టణంలోగల కాంగ్రెస్ కార్యాలయాన్ని ఈసి ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు గురువారం ఉదయం పరిశీలించారు. ఆ సమయంలో కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో వాటిని పగులగొట్టి లోపలికి ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. 

టీఆర్ఎస్ పార్టీ కుట్రలో భాగంగానే అధికారులు తాళాలు పగులగొట్టారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.