Asianet News TeluguAsianet News Telugu

నిలిచిపోయిన నేరెడ్‌మెట్ ఫలితం.. కారణమిదే..!!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేరెడ్‌మెట్‌ డివిజన్‌ ఫలితం వివాదాస్పదమైంది. నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్‌ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.

EC postponed neredmet election result ksp
Author
Hyderabad, First Published Dec 4, 2020, 9:54 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేరెడ్‌మెట్‌ డివిజన్‌ ఫలితం వివాదాస్పదమైంది. నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్‌ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు రిటర్నింగ్‌‌ అధికారి ఎస్‌ఈసీకి నివేదిక పంపించారు. కాగా, నేరెడ్‌మెట్ మినహా మిగతా 149 డివిజన్లలో లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ 55 స్థానాల్లో, బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించాయి.

ఎప్పటిలాగే పాతబస్తీ ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ తన పట్టును నిలుపుకొని పోటీ చేసిన 51 స్థానాలకు గాను 44 డివిజన్లను కైవసం చేసుకుంది.

ఇక గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారీ కూడా రెండు స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. అటు 106 డివిజన్‌లలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు డిపాజిట్ కోల్పోయారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios