తెలంగాణ అసెంబ్లీ రద్దైన వెంటనే  ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమల్లోకి వచ్చిందని ఈసీ ప్రకటించింది. ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలను ప్రకటించకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.


న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ రద్దైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమల్లోకి వచ్చిందని ఈసీ ప్రకటించింది. ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలను ప్రకటించకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.


అసెంబ్లీ రద్దైన వెంటనే కోడ్ ఆఫ్ కండక్ట్ వెంటనే అమల్లోకి వస్తోందని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కేంద్రప్రభుత్వంలోని కీలక అధికారులకు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలను జారీ చేసింది.

అసెంబ్లీ రద్దైన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఈసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న అపద్ధర్మ ప్రభుత్వం కొత్త పథకాలను అమల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ వనరులను ప్రైవేట్ పనుల కోసం ఉపయోగించుకోకూడదని కూడ ఈసీ స్పష్టం చేసింది.

1994 లో ఎస్ఆర్ బొమ్మై కేసును ఈసీ ప్రస్తావించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.. ఈ నెల 6వ తేదీన తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకొంది.