Asianet News TeluguAsianet News Telugu

హుజూరాబాద్, బద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల: సభలపై ఈసీ ఆంక్షలు


రెండు తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎన్నికల సంఘం ఎన్నికల సభలు, ర్యాలీలపై ఆ:క్షలు విధించింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది.బద్వేల్ ఎమ్మెల్యే మరణంతో ఉప ఎన్నికను నిర్వహించనున్నారు.

EC announces Huzurabad and badvel assembly election schedule
Author
Hyderabad, First Published Sep 28, 2021, 10:08 AM IST

హైదరాబాద్: తెలంగాణలోని  హుజూరాబాద్ (huzurabad bypoll), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేల్ (badvel Assembly bypoll) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం మంగళవారం నాడు విడుదల చేసింది.

 

తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender)రాజీనామా చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. బద్వేల్ ఎమ్మెల్యే అనారోగ్యంతో మరణించడంతో బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఆయన కడపలోని తన నివాసానికి చేరుకున్నారు. తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రచారం చేశారు. అయితే, మళ్లీ ఆయన అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం కడపలోని అరుణాచలం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారు. దీంతో బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

అక్టోబర్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ (election notification) విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరిస్తారు.  అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. నవంబర్ 2న కౌంటింగ్ (counting)నిర్వహిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు దేశంలోని 30 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం..ర్యాలీలు, రోడ్ షోలపై ఈసీ నిషేధం విధించింది. ఎన్నికల సందర్భంగా నిర్వహించే సభలకు వెయ్యి మందితోనే ఈసీ అనుమతిని ఇచ్చింది.  ఎన్నికల ప్రచారానికి సంబంధించి కరోనా ఆంక్షలను విధించింది ఈసీ.  

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఇంకా ఖరారు చేయలేదు.  
బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా ఓబులాపురం రాజశేఖర్ పోటీ చేయనున్నారు. వైసీపీ అభ్యర్ధిగా దాసరి సుధను ఆ పార్టీ బరిలోకి దింపనుంది.

 


 


 

Follow Us:
Download App:
  • android
  • ios