హైదరాబాద్‌‌లో బోరబండలో శుక్రవారం సాయంత్రం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బోరబండ సైట్ 3 ప్రాంతంలో భారీ శబ్ధాలు రావడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. సుమారు 15 సెకన్ల పాటు శబ్ధాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 1.4గా నమోదైంది.