భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం మధ్యామ్నం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం మధ్యామ్నం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. వెంటనే ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని చెప్పారు. భూప్రకంపనలు చోటుచేసుకున్న సమయంలో చిన్నపాటి శబ్దాలు కూడా వినిపించినట్టుగా స్థానికులు తెలిపారు. భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.