హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసిన కేసీఆర్ ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని డిసెంబర్‌ మొదటివారంలో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. న‌వంబ‌ర్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛత్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు.  

తెలంగాణ ప్రగతి రధ చక్రం ఆగకుండా కొనసాగాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని కేసీఆర్ కోరారు. తెలంగాణకు మేలు చేసే నిర్ణయాలనే తాము తీసుకుంటామనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు.

మేనిఫెస్టోలో పొందుపరచని పథకాలను కూడా అమలు చేశామని గుర్తు చేశారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను మేనిఫెస్టోలో పొందుపరచకున్నా ప్రభుత్వం అమలు చేసిందని ఆపధర్మ సీఎం కేసీఆర్ తెలిపారు.