Asianet News TeluguAsianet News Telugu

వడ్డీలు కట్టాలంటే అప్పులు చేయాల్సిందే : అసెంబ్లీలో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయక తప్పడం లేదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణలో ఆర్ధిక, సామాజిక అసమానతలు వున్నాయని వీటిని తొలగించేందుకు కృషి చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. 
 

dy cm mallu bhatti vikramarka key comments on telangana budget 2024 in assembly ksp
Author
First Published Feb 15, 2024, 8:19 PM IST | Last Updated Feb 15, 2024, 8:21 PM IST

ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయక తప్పడం లేదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణపై మొత్తం రూ.7.11 లక్షల కోట్ల అప్పుల భారం వుందని.. ఎఫ్ఆర్‌బీఎం పరిధి మేరకు రుణాలు తీసుకుంటామని భట్టి వెల్లడించారు. బడ్జెట్, బడ్జెట్ యేతర రుణాలను ఎఫ్ఆర్‌బీఎం కింద చూస్తామని కేంద్రం చెప్పిందని ఆయన గుర్తుచేశారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని.. తెలంగాణలో ఆర్ధిక, సామాజిక అసమానతలు వున్నాయని వీటిని తొలగించేందుకు కృషి చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. 

గతంలో కేటాయింపులకు నిధులు అందని పరిస్ధితి వుండేదని.. పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ రూపొందించామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. గడిచిన పదేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని.. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి అదనపు సిబ్బందిని కేటాయించామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే రూ.40 కోట్లు మంజూరు చేశామని.. గ్రూప్ 1లో 503 పోస్టులకు అదనంగా 64 పోస్టులు మంజూరు చేశామన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 13,444 పోస్టుల భర్తీ పూర్తి చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. 

రైతు భరోసా కోసం బడ్జెట్‌లో రూ.15,075 కోట్లు, గిరిజన సంక్షేమం కోసం రూ.2,800 కోట్లు , పంచాయతీరాజ్ శాఖ కోసం రూ.40 వేలు కోట్లు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.7,740 కోట్లు .. గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ కోసం రూ.2418 కోట్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కోసం రూ.723 కోట్లు  కేటాయిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లు నిర్మిస్తామని.. సాంఘిక సంక్షేమం కోసం రూ.5,815 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios