Asianet News TeluguAsianet News Telugu

హర్యానా రిజల్ట్స్: కాంగ్రెస్ వైపే దుశ్యంత్ చూపు కారణాలివే...

దుశ్యంత్ చౌతలా మద్దతు ఎవరికిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భూపిందర్ సింగ్ హుడా ఏమో ప్రెస్ మీట్ పెట్టి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దుశ్యంత్ చౌతాలా ఎవరికీ మద్దతిచ్చే ఆస్కారం ఉందొ ఒక సారి చూద్దాం. 

dushyant chautala looking towards congress than bjp?
Author
Chandigarh, First Published Oct 24, 2019, 3:42 PM IST

హర్యానా:హర్యానా హంగ్ దిశగా ముందుకెళుతోంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే ఆస్కారం లేదు. బీజేపీ కాంగ్రెసులు రెండూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమంటే మేమంటూ బీరాలు పలుకుతున్నారు. మరోపక్క కింగ్ మేకర్ గా అవతరించిన దుశ్యంత్ చౌతాలా మాత్రం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. 

ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా దుశ్యంత్ చౌతాలా మద్దతు తప్పనిసరి. దీనితో ఇప్పుడు దుశ్యంత్ చౌతలా మద్దతు ఎవరికిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భూపిందర్ సింగ్ హుడా ఏమో ప్రెస్ మీట్ పెట్టి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దుశ్యంత్ చౌతాలా ఎవరికీ మద్దతిచ్చే ఆస్కారం ఉందొ ఒక సారి చూద్దాం. 

అంతర్గత సమాచారం మేరకు జేజేపీలోని ఒక నలుగురు ఎమ్మెల్యేలు భూపిందర్ సింగ్ మనుషులు. దానికి తోడు హర్యానాలో జాట్ల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. జాట్ల సామాజిక వర్గమంతా బీజేపీ కి వ్యతిరేకంగా ఓట్లు వేశారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ పరిస్థితుల్లో తమ సామాజిక వర్గం మొత్తం వ్యతిరేకిస్తున్న బీజేపీతోని కలవడానికి దుశ్యంత్ చౌతాలా అంత త్వరగా ఒప్పుకోకపోవచ్చు. 

కానీ అమిత్ షా రంగంలోకి దిగారు. పరిస్థితులను తమకు అనుకూలంగా తిప్పుకోవడంలో అమిత్ షా సిద్ధహస్తుడు. గోవాలో క్రిస్టియన్ మైనారిటీ వర్గం అధికంగా ఉన్న చోటే వారందరిని తమవైపుగా తిప్పుకోగలిగింది బీజేపీ. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా బీజేపీ పరిస్థిలుతులను తమ వైపుగా తిప్పుకోవచ్చు. ఒకవేళ బీజేపీ ఖట్టర్ ని తప్పించి జాట్ ను ముఖ్యమంత్రి  అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా జాట్లను తమ వైపుగా తిప్పుకునే ఆస్కారం కూడా లేకపోలేదు. 

ప్రస్తుతానికి హర్యానాలో హడావుడి కాంగ్రెస్ కార్యాలయం,జేజేపీ కార్యాలయాల దెగ్గర ఉంది తప్ప బీజేపీ ఆఫీస్ వద్ద ఎటువంటి హడావుడి కనపడడం లేదు. కాంగ్రెస్ ఏకంగా దుశ్యంత్ చౌతాలాకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టేందుకు కూడా ముందుకొచ్చింది. కర్ణాటక ఫార్ములాను ఇక్కడ కూడా అప్లై చేయాలని డిసైడ్ అయిపోయి భూపిందర్ సింగ్ కు పూర్తి స్వేచ్ఛను కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇచ్చారు. 

భూపిందర్ సింగ్ కొడుకు దీపేంద్ర సింగ్ హుడా కూడా ఇందాక మాట్లాడుతూ తాము బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ చెప్పారు. ఏది ఏమైనా హర్యానాలో కాంగ్రెస్ వైపుగా దుశ్యంత్ చౌతాలా తన తొలి చూపును చూస్తారు అనైతే చెప్పవచ్చు. హడావుడంతా ఆ రెండు ఆఫీసుల చుట్టూరానే కనపడుతుంది. 

వీటితోపాటు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ భూపిందర్ సింగ్ చివర్లో ఒక మాటన్నారు. బీజేపీ తమ మిత్రులకు ఇచ్చిన హామీలను ఏనాడు నిలుపుకోలేదని అన్నారు. ఒకింత మాత్రం ఈ విషయమై దుశ్యంత్ చౌతాలా ఆలోచించే ఆస్కారం ఉంది. 

హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ముఖ్యంగా 4 పార్టీలు పోటీ పడుతున్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డి, జేజేపీ బరిలో ఉన్నాయి. ఆప్,బిఎస్పీలు కూడ బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలు మినహా ఇతర ఏ పార్టీ కూడా అన్ని సీట్లలో పోటీ చేయడం లేదు. హర్యానాలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో చాల మంది ధనవంతులు ఉన్నారు. 

ఐఎన్ఎల్డి నుంచి ఓం ప్రకాష్ చౌతాలా తన పెద్ద కొడుకు అజయ్ సింగ్, ఇద్దరు మనవళ్లు దుశ్యంత్ సింగ్, దిగ్విజయ్ సింగ్ లను సస్పెండ్ చేయడంతో, గత డిసెంబర్ లో దుశ్యంత్ చౌతాలా తన సొంత పార్టీ జన నాయక్ జనతా పార్టీని నెలకొల్పాడు. ఈ సరి దుశ్యంత్ చౌతాలా స్వయంగా ఉచనా కలాన్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. 

ఆర్టికల్ 370 రద్దు,ఎన్నార్సి తదితరాలతో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించగా, ఆర్ధిక సంక్షభం,పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల కష్ట నష్టాలను ప్రధాన అజెండాగా చేసుకొని ప్రతిపక్షాలు ప్రచారం చేసాయి. మొత్తం కలిపి 

రాష్ట్రంలో పార్టీ నేతృత్వం మారిన తరువాత హర్యానాలో కాంగ్రెస్ ఎలాగైనా తన పూర్వ వైభవాన్ని సాధించి తీరుతామని నమ్మకంగా ఉన్నారు. మరోవైపేమో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి తీరుతామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఉన్న 90 సీట్లలో ఎలాగైనా 75 సీట్లు గెలవాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఉన్న 90 సీట్లలో బీజేపీకి 48 సీట్లున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న 10 స్థానాలకు 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 

బీఎస్పీ, ఆప్,ఎల్ఎస్పీ, సహా చాలా పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాకపోతే వీరెవరూ అన్ని సీట్లలోనూ పోటీ చేయడం లేదు. బీజేపీ ఈ సరి ముగ్గురు క్రీడాకారులకు హర్యానాలో టిక్కెట్లు ఇచ్చింది. బబిత ఫోగట్, యోగేశ్వర్ దత్, సందీప్ సింగ్. సందీప్ సింగ్ హాకీ క్రీడాకారుడు కాగా, మిగిలిన ఇద్దరు కుస్తీ యోధులు. 

2014లో బీజేపీ తొలిసారిగా హర్యానాలో అధికారం చేపట్టింది. 47 సీట్లలో గెలవడం ద్వారా బీజేపీ అధికారం చేజిక్కించుకోగలిగింది. ఈ సంవత్సరామారంభంలో జరిగిన జింద్ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా తన కౌంట్ ను 48కి తీసుకెళ్లింది. ఐఎన్ఎల్డి  కి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ కు 17మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలకు చెరో ఎమ్మెల్యే ఉన్నారు. ఇంకో 5గురు స్వతంత్రులు 2014లో విజయం సాధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios