రెండు బస్సుల మద్య చిక్కుకొని ఓ వ్యక్తి మరణించిన ఘటన సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్ లో ఆదివారం నాడు చోటు చేసుకొంది.

హైదరాబాద్: రెండు బస్సుల మద్య చిక్కుకొని ఓ వ్యక్తి మరణించిన ఘటన సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్ లో ఆదివారం నాడు చోటు చేసుకొంది.రేతిఫైల్ బస్టాండ్ లో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బస్సు వెనుక నుండి వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుకనుండి దుర్గాప్రసాద్ ను మరో బస్సు ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల మధ్య దుర్గాప్రసాద్ చిక్కుకొన్నాడు. రెండు బస్సుల మధ్య తీవ్రగాయాలతో దుర్గాప్రసాద్ రక్షించాలని అరిచాడు. రెండు బస్సుల మధ్య నుండి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అయితే ఆయనను కాపాడేందుకు ఎవరూ కూడ ముందుకు రాలేదు. 

అక్కడే ఉన్న ప్రయాణీకులు కానీ, ఆర్టీసీ సిబ్బంది కానీ ముందుకు రాలేదు. 108 అంబులెన్స్ వచ్చేవరకు చోద్యం చూస్తూ నిలబడ్డారు. అంబులెన్స్ అక్కడికి వచ్చే సమయంలోనే దుర్గాప్రసాద్ మరణించాడు. రెండు బస్సుల మధ్య చిక్కుకొన్న దుర్గాప్రసాద్ ను కాపాడేందుకు ఎవరైనా ముందుకు వస్తే ప్రాణాలు దక్కి ఉండేవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అరగంటపాటు తనను రక్షించాలని దుర్గాప్రసాద్ కోరినా కూడ ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయమై గోపాలపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.