Asianet News TeluguAsianet News Telugu

మూగ యువతిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం...

మెదక్ లో ఓ మూగ అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిమీద యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. 

dumb girl kidnapped and gang-raped In medak
Author
First Published Dec 28, 2022, 2:05 PM IST

మెదక్ : తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అమ్మాయిల మీద అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. గుడి, బడి అని తేడా లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా అమ్మాయి కనిపిస్తే చాలు కిడ్నాప్ లు చేసి, సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలాంటి ో దారుణ ఘటనే మెదక్ లో వెలుగు చూసింది. 

మద్దూరు మండలం లాడ్నూరు గ్రామానికి చెందిన ఓ మూగ యువతిపై కామాంధులు రెచ్చిపోయారు. 23 యేళ్ల ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం రాత్రి కారులో వచ్చిన కొందరు యువకులు యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఆ తరువాత గ్రామశివార్లలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. 

కూతురును కారులో బలవంతంగా తీసుకుపోవడం గమనించిన తండ్రి.. వారి వెంట పడ్డాడు. కాగా కారులో ఆకునూరు గ్రామానికి చెందిన కనకస్వామి, నరేష్ అనే వ్యక్తులు కనిపించారు. ఈ వివరాలను పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదులో తెలిపాడు. ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. 

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం..

ఇదిలా ఉండగా, డిసెంబర్ 26న మెదక్ లోనే మరో దారుణ ఘటన జరిగింది. పట్టపగలే కొంతమంది దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లో ఉన్నమహిళ గొంతుకోసి, దారుణంగా హత్య చేశారు. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గత శనివారం మెదక్ లో చోటు చేసుకుంది. మెదక్ పట్టణ సీఐ మధు ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా తెలియజేశారు.

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కలాన్ శెట్టి గ్రామానికి చెందిన తలకొక్కుల కొడుకుల వెంకటేశం, సుజాత దంపతులు మెదక్ కు వలస వచ్చారు. ఇక్కడి పెద్ద బజార్లో అద్దెకు వుంటున్నారు. కూరగాయలు అమ్ముతుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రోజూలాగే శనివారం ఉదయం కూడా కూరగాయల అమ్మేందుకు భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. ఉదయం బేరాలు అయిపోయిన తర్వాత పది గంటల సమయంలో.. భార్య సుజాత  ఇంటికి వెళ్లి,  వంట చేసి.. తనకు, భర్తకు ఇద్దరికీ మధ్యాహ్నానికి భోజనం తీసుకువస్తానని  బయలుదేరింది.

10 గంటలకు వెళ్ళిన సుజాత.. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా తిరిగి రాలేదు. అంతేకాదు వెంకటేశం ఎన్నిసార్లు ఫోన్ చేసినా  ఎత్తడం లేదు. దీంతో అనుమానం వచ్చిన వెంకటేశం ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఇంట్లో సుజాత రక్తపు మడుగులో పడి ఉంది. ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే తేరుకుని భయాందోళనలతో స్థానికులను గట్టిగా కేకలు వేసి పిలిచాడు. వారి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

మెదక్ పట్టణ సీఐ మధు, డిఎస్పి సైదులు, ఎస్సై మల్లారెడ్డి,  మెదక్ రూరల్ సీఐ విజయ్కుమార్,  పోలీసు సిబ్బందితో సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తీసుకువచ్చారు. వీటి ఆదారంగా వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ రోహిణీప్రియదర్శిని ఘటనా స్థలానికి వచ్చి హత్యాతీరును పరిశీలించారు.. హంతకులను తొందరగా పట్టుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. 

హత్య జరిగిన తీరు అందరినీ భయాందోళనలకు గురి చేసింది. హంతకుడు సుజాత మెడ కోశారు. ముఖం మీద కత్తులతో తీవ్రంగా గాయపరిచారు. అత్యంత దారుణంగా చంపేశారు. సుజాత మెడలో ఉండే మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలను కనిపించలేదు. వాటినివారు ఎత్తుకెళ్లారని.. నగల కోసమే ఇంత దారుణానికి తెగించారని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios