Asianet News TeluguAsianet News Telugu

మోదీ ఫొటో లేదని రచ్చ.. కేసీఆర్‌ ఫ్లెక్సీ చింపేసిన బీజేపీ నేతలు...

వ్యాక్సినేషన్ ఫ్లెక్సీ మీద మోదీ ఫొటో లేదని టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ విషయమై వ్యాక్సినేషన్‌ ప్రారంభంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు గొడవ పడ్డారు. 

due to no modi photo bjp leaders tearing kcr banner in adilabad - bsb
Author
Hyderabad, First Published Jan 19, 2021, 3:21 PM IST

వ్యాక్సినేషన్ ఫ్లెక్సీ మీద మోదీ ఫొటో లేదని టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ విషయమై వ్యాక్సినేషన్‌ ప్రారంభంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు గొడవ పడ్డారు. 

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభోత్సవంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. 

కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేనందుకు బీజేపీ జడ్పీటీసీ సభ్యుడు పతంగే బ్రహ్మనంద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముండే సంజీవ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటంతో ఉన్న ఫ్లెక్సీని చింపేశారు. 

దీంతో టీఆర్‌ఎస్‌ ఎంపీపీ రాథోడ్‌ పుండలిక్‌, బీజేపీ జడ్పీటీసీ పతంగే బ్రహ్మనంద్‌ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించడంతో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సాఫీగా కొనసాగింది.

Follow Us:
Download App:
  • android
  • ios