Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు లేక.. గర్బిణిని 20కి.మీ.లు డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్లిన బంధువులు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ గిరిజన మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో ఆమెను డోలిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

Due to lack of road.. Relatives took the pregnant woman 20 kms to hospital in a dolly In Bhadradri Kothagudem - bsb
Author
First Published Sep 6, 2023, 12:15 PM IST

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజిన గర్భిణీల అవస్థలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గిరిజన గూడెంలకు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో అంబులెన్స్ వారి గ్రామానికి చేరుకోలేక పోవడంతో పురుటినొప్పులు మొదలైన ఓ గర్భిణిని ‘డోలి’ (తాత్కాలిక స్ట్రెచర్)లో - అటవీ ప్రాంతం గుండా ఆసుపత్రికి తీసుకెళ్లిన షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో ఆమె కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెను డోలిలో సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

దాదాపు 20 కిలోమీటర్ల మేర ఆమెను భుజాలపై ఎక్కించుకుని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మహిళను ఆరోగ్య కేంద్రం నుంచి అంబులెన్స్‌లో భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ బిడ్డకు జన్మనిచ్చింది.

తల్లీ, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios