మరో నాలుగు రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సమయంలో.. టీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది.  నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, నల్గొండ నియోజకవర్గ పార్టీ మాజీ ఇన్‌ఛార్జి దుబ్బాక నర్సింహారెడ్డి పార్టీని వీడారు. టీఆర్ఎస్ కీ, ఆ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. 

నల్గొండ అసెంబ్లీ టికెట్ తనకు దక్కుతుందని దుబ్బాక ఆశించారు. కానీ.. ఆ టికెట్ దక్కేలేదు. కనీసం   నామినేటెడ్ పదవి అయినా ఇస్తారని భావించాడు. కానీ ఆ హామీ నెరవేరేలా కనపడటం లేదని ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఆయనకు అనుచర బలం ఉంది. ఆయన త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం.