Asianet News TeluguAsianet News Telugu

ప్రోటోకాల్ పాటించలేదు.. సీఎం కేసీఆర్ పై దుబ్బాక ఎమ్మెల్యే

దుబ్బాకపై వివక్ష చూపించడం చాలా బాధకరమన్నారు. సిద్దిపేట మాదిరిగా దుబ్బాకకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. దుబ్బాకకు కొత్త బస్టాండ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 

Dubbaka MLA Raghunandan Rao Fire on CM KCR
Author
Hyderabad, First Published Dec 12, 2020, 8:03 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారులు సిద్ధిపేటలో ప్రోటోకాల్ పాటించలేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలిసి రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.

దుబ్బాకలో వంద పడకల ఆస్పత్రిని పూర్తి చేయలేదన్నారు. మెడికల్ కళాశాలను దుబ్బాకలో కాకుండా సిద్ధిపేటలో ఏర్పాటు చేశారని చెప్పారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కురింగ్ రోడ్డు ఉంటుంది కానీ.. దుబ్బాకకు మాత్రం ఉండదా అని ప్రశ్నించారు. వెయ్యి రెండు పడక గదుల ఇళ్లు దుబ్బాకకు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దుబ్బాకపై వివక్ష చూపించడం చాలా బాధకరమన్నారు. సిద్దిపేట మాదిరిగా దుబ్బాకకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. దుబ్బాకకు కొత్త బస్టాండ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం ఇస్తే.. దుబ్బాక కు కనీసం బస్టాండ్ ఇవ్వరా అని ప్రశ్నించారు.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి 155 కిలోమీటర్ల పరిధిలో మరరో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టకూడదనే అగ్రిమెంట్ ఉందని... ఈ విషయం సీఎం కేసీఆర్ కి తెలియదా అని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం వరంగల్ కి ఇచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయంఎక్కడుందో.. రేపు సిద్దిపేట పరిస్థితి కూడా అలానే ఉంటుందన్నారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సిద్దిపేటలో వరాల జల్లు కురిపించారన్నారు. ప్రోటోకాల్ పాటించని సీఎం కేసీఆర్, అధికారులపై ఫిర్యాదు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వివక్ష లేకుండా చూస్తేంటే కేసీఆర్ వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios