సాయంత్రం కేసిఆర్ తో డిఎస్ భేటీ: ఏమవుతుంది?

DS to meet KCR today
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కలిసే అవకాశం ఉంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కలిసే అవకాశం ఉంది. ఆయన బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు కేసిఆర్ ను కలుస్తారని సమాచారం.

గతంలో తాను కేసిఆర్ ను కలవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదని, కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకలేదని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు డిఎస్ ను కలిసేందుకు కేసిఆర్ అంగీకరించినట్లు చెబుతున్నారు. 

డిఎస్ ను వెంటనే సస్పెండ్ చేయాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సహా జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులకు కేసిఆర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ స్థితిలో కేసిఆర్ తో డిఎస్ భేటీలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. డిఎస్ కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. అయితే, డిఎస్ తన రాజీనామా పత్రాన్ని కేసిఆర్ కు సమర్పిస్తారా అనేది కూడా తెలియడం లేదు.

loader