Asianet News TeluguAsianet News Telugu

సిద్దిపేటలో మద్యం మత్తులో బిల్‌బోర్డుకు వేలాడిన మందుబాబు.. వైరల్ వీడియో ఇదే

సిద్దిపేటలో ఓ వ్యక్తి మద్యం మత్తులో ఓ బిల్‌బోర్డు ఫ్రేముకు వేలాడాడు. కొద్ది సేపటి తర్వాత పైనకు ఎక్కే ప్రయత్నం చేసి కిందపడిపోయాడు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

drunk man climbing up billboard in telanganas siddipet, video goes viral
Author
First Published Jan 13, 2023, 1:33 PM IST

సిద్దిపేట: తెలంగాణలోని సిద్దిపేటలో ఓ మందుబాబు వీరంగానికి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపు నడిబజారులో గందరగోళం నెలకొంది. ఫుల్‌గా డ్రింక్ చేసిన ఓ వ్యక్తి బిల్‌బోర్డుకు వేలాడుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో గురువారం హల్‌చల్ చేసింది. బుధవారం సిద్దిపేటలో ఈ ఘటన జరిగింది. దీంతో న్యూసెన్స్ చేసినందుకు ఆ వ్యక్తిపై కేసు నమోదైంది.

ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత ఈ ఘటనపై స్పందిస్తూ ‘ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆయన పూర్తిగా మత్తులో ఉన్నాడు. అంతేతప్పా ఇది డబుల్ బెడ్‌రూమ్ గురించో లేదా ఇతర మరేదాని గురించో కాదు. అతనిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశాం’ అని తెలిపారు.

Also Read: విమానంలో కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన యువకుడు.. వీడియో వైరల్...!

వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన బిల్‌బోర్డు ఫ్రేమ్‌కు వేలాడుతూ కనిపించాడు. రెండు చేతులతో ఆ ఫ్రేమ్‌ను పట్టుకుని ఉన్నాడు. కొంతసేపటికి రెండు కాళ్లను పైకి లేపి ఆ ఫ్రేమ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అది సాధ్యపడలేదు. అయితే, అప్పటికే అతని చుట్టూ కొన్ని తాళ్లు చుట్టి ఉన్నట్టు కనిపించాయి. కొద్ది సేపటికి చేతులు పట్టుతప్పి కిందికి జారాడు. కానీ, అప్పటికే అక్కడ ఓ స్కూల్ వ్యాన్ నిలిపి ఉంచడంతో ప్రమాదం తప్పింది. అతను సేఫ్‌గా ఆ వ్యాన్ పై ల్యాండ్ అయ్యాడు. వెంటనే అక్కడ ఉన్న కొందరు యువకులు వ్యాన్ ఎక్కి ఆ తాళ్లను అతడి నుంచి వేరు చేసిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios