ఆబ్కారీ అధికారులపై మందుబాబులు దారుణానికి తెగబడ్డారు. విచారించి వెళ్లిపోతున్న వారిమీద దాడికి దిగారు. ఎస్సై, కానిస్టేబుల్ ను కొట్టారు. దీంతో నిందితులు నలుగురిని మీద కేసు నమోదు చేశారు పోలీసులు.
నిజామాబాద్ : నాటుసారా విక్రయాలు కేంద్రాలపై దాడి చేయడానికి వెళ్ళిన abkari department ఎస్ఐ, కానిస్టేబుల్ లపై మందుబాబులు దాడి చేసిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... nizamabad జిల్లా భీమ్గల్ మండలం పురాణీపేట్ శివారులో నాటు సారా విక్రయ కేంద్రాలపై దాడి చేయడానికి ఆబ్కారీ ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్ వాహనంలో వెళ్లారు. పురాణీపేట్ శివారుల్లోకి చేరుకోగానే liquor తాగుతున్న నలుగురు వ్యక్తులు వీరిని చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అందులో ఒకరు పట్టుబడ్డారు.
ఆయనను విచారించి వెళుతుండగా ముగ్గురు మందుబాబులు ఎస్సై, కానిస్టేబుల్ మీద విరుచుకుపడ్డారు. ఎస్సై చేతిలో ఉన్న లాఠీని, లాక్కుని తీవ్రంగా కొట్టారు. ఆబ్కారీ ఎస్సై నర్సింలు ఫిర్యాదు మేరకు నలుగురిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు భీంగల్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. కేసు నమోదైనా పోలీసులు వారిని రిమాండ్ కు తరలించలేదు. రాజకీయ ఒత్తిడి కారణంగానే రిమాండ్ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అధికారుల మీద నేరస్తులు దాడులు చేసే ఘటనలు ఇప్పుడు కొత్తేమీ కాదు. ఇలాంటి ఘటనే నిరుడు నవంబర్ లో కడపలో చోటు చేసుకుంది. కడప జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్లు ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారు. ఫారెస్ట్ అధికారుల నుండి తప్పించుకొనే క్రమంలో వాహనం దూకిన ఓ కూలీ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మైదుకూరు నియోజకవర్గంలోని కాజీపేట మండలంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడానికి తమిళనాడు కూలీలు వచ్చారు.
అయితే మైదకూర్ కు సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద తమిళ కూలీలను గుర్తించిన అటవీశాఖాధికారులు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో తమిళనాడుకూలీలు పారెస్ట్ అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో ఫారెస్ట్ అధికారి ఒకరు గాయపడ్డారు. ఆ తర్వాత వాహనంలో తమిళ కూలీలు పారిపోతున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు వారిని సినీ ఫక్కిలో వెంటాడారు. అయితే ఈ సమయంలో ఫారెస్ట్ అధికారులకు చిక్కుతామనే భయంతో వాహనం నుండి ముగ్గురు కూలీలు ఈ ఘటనలో ఒక తమిళ కూలీ మరణించాడు. మరో ఇద్దరు కూలీలు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లరకు ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఎర్ర చందనం స్మగ్లర్లపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది తమిళ కూలీలు మరణించారు. ఈ ఘటన 2015 ఏప్రిల్ 7వ తేదీన చోటు చేసుకొంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది. అయినా కూడా రాష్ట్రంలో ఎర్ర చందనాన్ని స్మగ్లర్తు తరిలించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు నుండి వచ్చే కూలీలను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నారు. అయితే నిన్న రాత్రి కూడా మైదుకూరు వద్ద తమిళకూలీలను గుర్తించి ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేస్తుండగా దాడి చేసి కూలీలు పారిపోయే ప్రయత్నం చేశారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
