Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌పై సైబర్ దాడి: ఉత్పత్తుల నిలిపివేత

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పై సైబర్  దాడి జరిగింది. దీంతో ఐదు దేశాల్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తన ఉత్పత్తులను నిలిపివేసింది. 24 గంటల తర్వాత ఉత్పత్తులను తిరిగి ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

Dr. Reddy Laboratories shuts units after cyber attack lns
Author
Hyderabad, First Published Oct 22, 2020, 5:24 PM IST

హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పై సైబర్  దాడి జరిగింది. దీంతో ఐదు దేశాల్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తన ఉత్పత్తులను నిలిపివేసింది. 24 గంటల తర్వాత ఉత్పత్తులను తిరిగి ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

గురువారం నాడు ఉదయం సైబర్ దాడి జరిగినట్టుగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.సైబర్ దాడి జరిగిన తర్వాత అవసరమైన నివారణ చర్యలు తీసుకొనేందుకు వీలుగా డేటా సెంటర్ సేవలను వేరు చేసినట్టుగా డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రకటించింది.

అమెరికా, లండన్, బ్రెజిల్, రష్యా, ఇండియాలలో ఉత్పత్తును ఆ సంస్థ నిలిపివేసింది. మరో 24 గంటల తర్వాత ఉత్పత్తులను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించింది.స్టాక్ ఎక్చేంజ్ కు ఇచ్చిన సమాచారంలో కంపెనీపై సైబర్ దాడి జరిగిన విషయాన్ని తెలిపింది.

అంతేకాదు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొన్నట్టుగా ప్రకటించింది. డేటా సెంటర్  సేవలను వేరు చేశామని చెప్పారు.డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం పరిశోధనలు చేస్తోంది. ఈ మేరకు డీసీజీఐ ఆమోదం తీసుకొన్న విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios