హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిల కలయిక మంచి పరిణామమేనని కొనియాడారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్. ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతకు సంబంధించి ఈ సోయి ముందెందెకు లేదని కేసీఆర్ ను కడిగిపడేశారు. 

గతంలో కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలపై టీఆర్ఎస్ నేతలు గతంలో కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడేమో రెండు రాష్ట్రాలు వేర్వేరు కాదంటున్నారని విమర్శించారు. 

గతంలో ప్రజల  బాగోగుల గురించి ధ్యాస ఎందుకు లేదని కేసీఆర్ ను కడిగిపారేశారు. పోలవరం, పులిచింతల, పోతిరెడ్డిపాడుపై మీరు మాట్లాడిన మాటలకు సమాధానం దొరికిందా అని నిలదీశారు. ఇకపోతే భద్రాచలం విషయంలో మీ స్టాండ్ ఏంటో చెప్పాలని నిలదీశారు. 

రామాలయం ముంపునకు గురవ్వకుండా తీసుకున్న నిర్ణయాలు ఏంటో చెప్పాలని నిలదీశారు. గతంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పిన మీరు ఇప్పుడెలా న్యాయ జరుగుతుందో చెప్పాలి అని నిలదీశారు డా.కె.లక్ష్మణ్.