మంథని మండలం గాజులపల్లికి చెందిన కోమలతతో కాల్వశ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్ కు చెందిన శ్రీకాంత్ కు వివాహమయ్యింది. రెండేళ్లుగా శ్రీకాంత్ కోమలతను కాపురానికి తీసుకెళ్లడం లేదు. 

పెద్దపల్లి : భార్యాభర్తల వివాదంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పీఆర్ఓగా చెప్పుకుంటున్న తోట శ్రీకాంత్ మీద మంథని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మంథని ఎస్సై చంద్రకుమార్ వివరాల ప్రకారం.. మంథని మండలం గాజులపల్లికి చెందిన కోమలతతో కాల్వశ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్ కు చెందిన శ్రీకాంత్ కు వివాహమయ్యింది. రెండేళ్లుగా శ్రీకాంత్ కోమలతను కాపురానికి తీసుకెళ్లడం లేదు. 

ఆదివారం ఎదులాపూర్ లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతా జరగాల్సి ఉంది. కోమలత గ్రామ సర్పంచ్ వద్దకు పిలిపిస్తే శ్రీకాంత్ రాలేదు. భర్తతో కలిసి వెళ్లేందుకు కోమలత సిద్ధంకాగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కోమలతమీద చేయి చేసుకున్నాడు.

కోమలత మంథని పోలీస్ స్టేషన్ కు చేరుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శ్రీకాంత్ మీద ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.