TS ECET Answer Key 2022 : ఆన్సర్ కీ, క్వశ్చన్ పేపర్, రెస్పాన్స్ షీట్ లను ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు...

TSCHE TS ECET 2022 జవాబు కీని అభ్యర్థి రెస్పాన్స్ షీట్,  క్వశ్చన్ పేపర్ లతో పాటు ఈరోజు విడుదల చేయనుంది. పరీక్ష పోర్టల్ - ecet.tsche.ac.inలో లాగిన్ అయి.. TS ECET ఆన్సర్ కీ 2022ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Download TS ECET Question Paper, Answer Key, Response Sheet in website, details here

హైదరాబాద్ : TSCHE తరపున JNTU హైదరాబాద్ ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్ష TS ECET 2022 జవాబు కీని విడుదల చేయడానికి అంతా సిద్ధం చేసింది. అధికారిక అప్‌డేట్ ప్రకారం, తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, TS ECET 2022 ఆన్సర్ కీ ఈరోజు - 2 ఆగస్టు 2022 సాయంత్రం విడుదల కానుంది. తాత్కాలిక జవాబు కీతో పాటు, TSCHE TS ECET 2022 ప్రశ్నాపత్రం, అభ్యర్థి రెస్పాన్స్ షీట్‌లను కూడా ఇందులో పొందుపరుస్తుంది. దరఖాస్తు ఫారమ్, హాల్ టిక్కెట్‌ల మాదిరిగానే, TS ECET ఆన్సర్ కీ 2022 విడుదలను ఎగ్జామ్ అథారిటీ ఆన్‌లైన్‌లో అధికారిక పోర్టల్ - ecet.tsche.ac.in ద్వారా విడుదల చేస్తున్నారు. అదే సమయంలో.. లింక్ ఓపెన్ చేసుకుని.. డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలుగా లింకు కూడా యాక్టివేట్ చేయబడుతుంది. దీనివల్ల అభ్యర్థులు నేరుగా యాక్సెస్‌ను పొందుతారు.

TS ECET ఆన్సర్.. కీతో పాటు అబ్జెక్షన్ వీండో కూడా.. 

TS ECET 2022 జవాబు కీ విడుదలతో పాటు మరో విండోను కూడా ఎగ్జామ్ అథారిటీ ఈ రోజు నుంచి ఆగస్ట్ 4 వరకు అందుబాటులో ఉంచుతుంది. ఇదే అబ్జెక్షన్ విండో. దీన్ని కూడా ఈ రోజే అందుబాటులోకి తీసుకువస్తారు. TS ECET 2022 జవాబు కీలో ఇచ్చిన సమాధానాల్లో ఏవైనా తప్పు అని అభ్యర్థులు భావిస్తే, దానిమీద సందేహాలు, అభ్యంతరాలను స్వీకరించడానికి ఈ విండో ఉపయోగపడుతుంది. TS ECET ఆన్సర్ కీ 2022కి వ్యతిరేకంగా అబ్జెక్షన్స్ విండో 4 ఆగస్టు 2022 - సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. అందువల్ల, జవాబు కీలో ఏదైనా తప్పుగా అనిపించినా, సందేహాలు తలెత్తినా, ఏదైనా అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వాటిని ప్రశ్నించవచ్చు.

TS Eamcet 2022: తెలంగాణలో వాయిదా పడిన పరీక్షల రీషెడ్యూల్.. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ఎప్పుడంటే..

TS ECET ఆన్సర్ కీ 2022ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయడం ఎలా?

అభ్యర్థులకు అనుకూలమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, JNTU హైదరాబాద్ తన అధికారిక పోర్టల్‌లలో ఆన్‌లైన్‌లో రెస్పాన్స్  షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్‌లతో పాటు TS ECET ఆన్సర్ కీ 2022ని ప్రచురిస్తుంది. TS ECET 2022 పరీక్ష కోసం తాత్కాలిక ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ecet.tsche.ac.inకి లాగిన్ అవ్వాలి. పోర్టల్‌లోకి వచ్చిన తర్వాత, అభ్యర్థులు TS ECET 2022 లింక్‌ను డౌన్‌లోడ్ చేసి, దానిపై క్లిక్ చేయాలి. తదుపరి దశలో, పోర్టల్ లో అడిగిన వివరాలను అభ్యర్థులు తప్పనిసరిగా నమోదు చేయాలి. అంటే, పరీక్ష రోల్ నంబర్, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. ఆ తరువాత TS ECET 2022 జవాబు కీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios