Asianet News TeluguAsianet News Telugu

నెటిజన్ ట్వీట్.. కాలేజీ రోజుల్లోకి కేటీఆర్‌: హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు..?

ఇప్పుడంటే లేవు కానీ.. గతంలో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు తెగ కనిపించేవి. 80వ దశకంలో నగర జీవిని గమ్యస్థానానికి చేర్చిన ఈ ప్రగతి రథ చక్రాలు కాలక్రమంలో కనుమరుగయ్యాయి.

Double decker buses might make a comeback in Hyderabad ksp
Author
Hyderabad, First Published Nov 7, 2020, 2:47 PM IST

ఇప్పుడంటే లేవు కానీ.. గతంలో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు తెగ కనిపించేవి.నిజాం కాలంలో ప్రారంభమై  80వ దశకం వరకు కూడా నగర జీవిని గమ్యస్థానానికి చేర్చిన ఈ ప్రగతి రథ చక్రాలు కాలక్రమంలో కనుమరుగయ్యాయి.

ఈ నేపథ్యంలో షాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేయడంతో వాటిపై మళ్లీ చర్చ మొదలైంది.

ఒకప్పుడు జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జ‌ల్‌గంజ్‌, అబిడ్స్‌, హుస్సేన్ సాగ‌ర్‌, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌ వరకు బస్సులు తిరిగేవని, ఇప్పుడు మళ్లీ అలాంటి డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్ర‌యాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాల‌ని  కేటీఆర్‌ను కోరుతూ ట్వీట్‌ చేశారు.

దీనిపై స్పందించిన కేటీఆర్‌.. ఆయన కూడా బాల్యంతో పాటు కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. తాను అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామ‌ర్ స్కూల్లో తాను చ‌దువుకునే రోజుల్లో ఆ దారిగుండా వెళ్తున్న‌ప్పుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు క‌నిపించేవని, వాటి జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.  

అయితే ఆ బస్సులను ఎందుకు పూర్తిగా ఆపేశారో తనకు తెలియదని, మళ్లీ హైదారాబాద్‌ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులను తీసుకొచ్చే అవకాశం​ ఏమైనా ఉందా అని రవాణా ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌ను కేటీఆర్ అడిగారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్‌ సూచించారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios