మంచాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు శంకుస్థాపన

double bed room hosues foundation stone at manchala mandal
Highlights

వేగంగా నిర్మాణాలు

రంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఊపందుకుంది. మంచాల మండలం లింగంపల్లి గేటువద్ద 5.04 కోట్ల వ్యయంతో నిర్మించే డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్తాపన చేశారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుండెమోని జయమ్మ, జిల్లా రైతు సమన్వయకమిటీ కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, సింగిల్‌ విండో చైర్మెన్‌ మొద్దు సిఖిందర్‌ రెడ్డి, సర్పంచులు , ఎంపిటిసిలు , TRS పార్టీ నాయకులు , హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సిఎం కేసిఆర్ పేదల కోసమే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ప్రారంభించారని అన్నారు. నియోజకవర్గంలో ఇల్లు లేని కుటుంబం చూసేవరకు తాను నిద్రపోనని ప్రకటించారు.

loader