Asianet News TeluguAsianet News Telugu

కాళేశ్వరంపై జ్యూడీషియల్ ఎంక్వైరీ అంటూ టైం పాస్ చేయొద్దు - బీజేపీ నేత డీకే అరుణ

DK Aruna : కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడీషియల్ ఎంక్వైరీ పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయపాన చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. గత ప్రభుత్వం సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా జారీ చేసిన జీవోను సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Dont pass the time by calling for a judicial inquiry on Kaleshwaram - BJP leader DK Aruna..ISR
Author
First Published Jan 7, 2024, 4:26 PM IST

DK Aruna : కాంగ్రెస్ ప్రభుత్వం పై బీజేపీ నాయకురాలు, ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై తీవ్ర ఆరోపణలు చేశారని, సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండాలని ఆమె సూచించారు.

ఇక ముందూ నా బాధ్యత ఇలాగే నిర్వర్తిస్తా - నెల రోజుల పాలనపై రేవంత్ రెడ్డి

బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు భారీగా నిధులు స్వాహా చేశారని, వాటిపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ తానే ఇంజనీర్ గా మారి ప్రాజెక్టులు కట్టానని చెప్పారని, మరి అవి ఈరోజు కుంగిపోతున్నాయని, వాటిని తెలంగాణ ప్రజలు చూస్తూ ఉరుకోవాలా అని ప్రశ్నించారు. 

జపాన్ లో మళ్లీ భూకంపం.. హోన్షు వెస్ట్ కోస్ట్ లో కంపించిన భూమి..

ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, కాబట్టి వీటిపై విచారణ జరిపే అవకాశం ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఆ దిశగా ఆదేశాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో జారీ చేసిందని, వెంటనే దానిని రద్దు చేసి రాష్ట్రంలోకి ఆ సంస్థను అనుమతించాలని కోరారు.

ప్రజాపాలన దరఖాస్తు చించేసిన అధికారి... మంత్రి పొన్నం సీరియస్ యాక్షన్

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పై జ్యూడీషియల్ ఎంక్వైరీ పేరు చెప్పి టైమ్ వేస్ట్ చేయాలని చూస్తోందని ఆమె అన్నారు. అలా చేయకూడదని సూచించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై లక్ష కోట్లకు అంచనాలు పెంచి, వేలకోట్ల అవితికి పాల్పడిందని డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే గత ప్రభుత్వం తెచ్చిన సీబీఐ విషయంలో జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios