జనగామ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిమాని కృష్ణ గుండెపోటుతో మరణించారు.జనగామ జిల్లాలోని కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ... ట్రంప్ కు వీరాభిమాని. 31 ఏళ్ల కృష్ణ హిందూ దేవుళ్లతో పాటు ట్రంప్ కు కూడ ప్రతి రోజూ పూజిస్తాడు.

ఇటీవల ట్రంప్ దంపతులకు కరోనా సోకింది. మిలటరీ ఆసుప్రతిలో చికిత్స  తీసుకొన్న తర్వాత  ఆయన వైట్ హౌస్ కు చేరుకొన్నారు.ట్రంప్ కు కరోనా సోకిన విషయం తెలిసిననాటి నుండి కృష్ణ ఆవేదనతో ఉన్నాడని ఆయన మిత్రులు చెబుతున్నారు.ట్రంప్ కు కరోనా తగ్గిపోవాలని ఆయన ప్రార్ధనలు చేసేవారని వారు గుర్తు చేసుకొన్నారు. 

ఇదే బాధతో బుస్సా కృష్ణ మరణించాడని చెబుతున్నారు మిత్రులు.ట్రంప్ విగ్రహాన్ని కృష్ణ తన ఇంట్లో ఏర్పాటు చేసుకొన్నాడు.  ఈ విగ్రహాం వద్ద కూడ ఆయన పూజలు చేస్తుంటాడు.కరోనా నుండి ట్రంప్ కోలుకొన్నాక కూడ కృష్ణ ఈ బాధ నుండి బయటపడలేదు. ఇదే వేదనతో గుండెపోటుతో కృష్ణ మరణించినట్టుగా స్థానికులు చెబుతున్నారు.