హైదరాబాద్: రోడ్డుపై వదిలివెల్లిన పసికందును కుక్కలు పీక్కుతిన్న ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుఝామున ఈ సంఘటన జరిగింది. బంజారా హిల్స్ లో నివాసముండే ప్రైవేట్ ఉద్యోగి అలీ శనివారం సెకండ్ షో సినిమా చూసి తిరిగివస్తున్నాడు. రాత్రి 2.15 ప్రాంతంలో తన ఇంటివద్ద కుక్కలు గుంపుగా కొట్టుకుంటుండడంతో అటు వైపుగా వెళ్ళాడు. 

అక్కడికి అతను వెళ్లే సరికి కుక్కలు పీక్కుతిన్న పసికందు మృతదేహాన్ని చూసి బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి వచ్చిన పోలీసువారు కేసు నమోదు చేసుకొని ఆ పసికందు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని బంజారాహిల్స్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. 

విచారణ జరుగుతోందని, ఆ పసికందును అక్కడ ఎవరు వదిలివెళ్ళారో తెలుసుకుంటున్నామని ఆ పోలీసు అధికారి తెలిపారు. సీసీటీవీ ఫ్యూటేజీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.