Asianet News TeluguAsianet News Telugu

‘‘దట్ ఈజ్ గవర్నమెంట్ హాస్పిటల్’’...సర్జరీ చేసి, దూది మరిచిన వైద్యులు

కొద్దిరోజుల క్రితం శస్త్రచికిత్స నిర్వహించిన కడుపులో కత్తెర మరిచిపోయన ఘటన మరవకముందే.. సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో ఇదే తరహా ఘటన జరిగింది. కాకపోతే అక్కడ కత్తెర మరచిపోతే... ఇక్కడ దూది మరిచిపోయారు. 

Doctors Leaves cotton ball In Patient Stomach
Author
Siddipet, First Published Mar 5, 2019, 8:59 AM IST

కొద్దిరోజుల క్రితం శస్త్రచికిత్స నిర్వహించిన కడుపులో కత్తెర మరిచిపోయన ఘటన మరవకముందే.. సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో ఇదే తరహా ఘటన జరిగింది. కాకపోతే అక్కడ కత్తెర మరచిపోతే... ఇక్కడ దూది మరిచిపోయారు.

వివరాల్లోకి వెళితే... సిద్ధిపేట జిల్లా నంగునూరుకు చెందిన జంగిటి స్వప్న గత నెల 13న కాన్పు కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు.

ఆ సమయంలో స్వప్నకు తీవ్ర రక్తస్రావం కావడంతో దానిని ఆపేందుకు దూది ఉండను అమర్చారు వైద్యులు. సర్జరీ తర్వాత దానిని తీయటం మరిచిపోయిన డాక్టర్లు అలాగే కుట్లు వేసేశారు.

డిశ్చార్జ్ అనంతరం ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా స్వప్నకు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు సిద్ధిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ స్కానింగ్, ఇతర పరీక్షల్లో భాగంగా స్వప్న కడుపులో దూది ఉండ ఉన్నట్లు తేలింది. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి దానిని తొలగించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడిన కుటుంబసభ్యులు సిబ్బందితో వాగ్వావాదానికి దిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios