ఈ వెబినార్ లో వైద్యులు కాసుల లింగా రెడ్డి మాట్లాడుతూ..ఇవ్వాళ్టి పరిస్తితి అర్ధం కావాలంటే గత చరిత్రను అధ్యయనం చేయాలన్నారు. నాటో ఏర్పాటు లక్ష్యం తెలుసుకోవాలన్నారు.
ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం ఆధ్వర్యంలో 01.03.2022 గూగుల్ మీట్ ద్వారా యుద్ధం - శాంతి (రష్యా - ఉక్రెయిన్ యుద్ద పరిణామాలు) అనే అంశం మీద వెబినార్ నిర్వహించడం జరిగింది.
డాక్టర్ కాసుల లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వెబినార్ లో డాక్టర్ కె.విజయ్ కుమార్, డాక్టర్ ఎస్. జతిన్ కుమార్, ఇఫ్టు జాతీయ కార్యదర్శి పి.ప్రసాద్ ప్రసంగించారు.
ఈ వెబినార్ లో వైద్యులు కాసుల లింగా రెడ్డి మాట్లాడుతూ..ఇవ్వాళ్టి పరిస్తితి అర్ధం కావాలంటే గత చరిత్రను అధ్యయనం చేయాలన్నారు. నాటో ఏర్పాటు లక్ష్యం తెలుసుకోవాలన్నారు.
. నాటోలో సభ్యత్వం తీసుకోవటం అంటేనే యుద్దాన్ని కోరుకోవడమని చెప్పారు.. అమెరికా చేతిలో తోలుబొమ్మలా మారిన నాటో ప్రపంచంలో అశాంతిని కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం శాంతి నుండి యుద్దానికి వెళ్తున్న దశలా ఉందని వక్తలు అభిప్రాయ పడ్డారన్నారు.
ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న దాడిని తక్షణం నిలిపివేయాలని కోరారు. ఉక్రెయిన్ నాటో లో చేరాలనే అభిప్రాయాన్ని మార్చుకొని తన దేశ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అడుగులు వేయాలని అభిప్రాయపడ్డారు. నాటో నీ రద్దు చేసి యుద్ధాలను నివారించాలని కోరారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను తక్షణమే స్వదేశానికి రప్పించేందుకు యుద్ద ప్రాతిపదికన ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల డాక్టర్లతో పాటు 50మంది పాల్గొన్నారు.
