హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ కు చెందిన డాక్టర్ షరీఫ్ హుస్సెన్ గురువారం నాడు గుండెపోటుతో మరణించాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ హుస్సేన్ మరణించినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు.

డాక్టర్ షరీఫ్ హుస్సెన్ గత నెల 27వ తేదీన ఇంటి నుండి కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి బెంగుళూరుకు తరలిస్తుండగా అనంతపురం పోలీసులు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి డాక్టర్ ను  రక్షించారు.

కిడ్నాపర్ల నుండి ప్రాణాలతో బయటపడిన డాక్టర్ గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.రాజేంద్రనగర్ కు చెందిన డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు.

హుస్సేన్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని భావించిన అతని బంధువు ముస్తఫా కిడ్నాప్ చేయించినట్టుగా  పోలీసులు తెలిపారు. బిట్ కాయిన్ రూపంలో డబ్బులు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. డాక్టర్ హుస్సేన్ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఖలీద్ ను అరెస్ట్  చేసి విచారిస్తే ఈ విషయాలు వెలుగు చూసింది

ఏపీ పోలీసుల సహాయంతో డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.