హైదరాబాద్‌లో పట్టపగలు ఓ డాక్టర్‌ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. హిమాయత్ సాగర్ దర్గా సమీపంలో మంగళవారం డాక్టర్ బెహజాట్ హుసాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. 

పక్కా పథకం ప్రకారం బుర్కా వేసుకుని వచ్చి తన కారులోనే కిడ్నాప్‌కు తెగబడ్డారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా కిడ్నాప్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. డాక్టర్ సెల్‌ఫోన్ కాల్ రికార్డింగ్‌ను సైతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.