Asianet News TeluguAsianet News Telugu

మార్ఫింగ్ ఫొటోలు: లేడీ క్లాస్ మేట్ కాపురంలో వైద్యుడి చిచ్చు

కాలేజీ రోజుల్లో సదరు యువతితో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి వాటిని ఆ ‘ఎంబీబీఎస్‌ గ్రూప్‌’లో పోస్ట్‌ చేశాడు. గ్రూప్‌ అడ్మిన్‌ ఎవరనేది సభ్యులు తెలియకుండా ఉండేందుకు కొత్త నంబర్‌తో దీనిని క్రియేట్‌ చేశాడు.

Doctor arrested in morphing photos case
Author
Hyderabad, First Published Jan 24, 2019, 11:42 AM IST

హైదరాబాద్: ఓ వైద్యుడు తన మహిళా క్లాస్ మేట్ కాపురంలో చిచ్చు పెట్టాడు.  మెడిసిన్‌లో తనకు క్లాస్‌మేట్‌ అయిన వివాహిత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వాటిని ఆమె తరఫు వారికి పంపించాడు. దాంతో ఆమె కాపురంలో చిచ్చు పెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాదు నగరం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

ఎల్బీనగర్‌కు చెందిన ఆ వైద్యుడిని అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌కు చెందిన సోహెబ్‌ అలీతో పాటు నగరానికి చెందిన మరికొందరు కొన్నేళ్ల క్రితం చైనాలో ఎంబీబీఎస్‌ చదివారు. అప్పట్లో ఇతడికి క్లాస్‌మేట్స్‌ అయిన యువతీయువకులు వివాహం చేసుకున్నారు. 

ప్రస్తుతం వీరికి ఓ కూతురు ఉంది. ఎంబీబీఎస్‌లో తన క్లాస్‌మేట్స్‌తో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేయాలని భావించిన సోహెబ్‌ దీనికోసం కొత్తగా ఓ సెల్‌ఫోన్‌ నంబర్‌ తీసుకుని గ్రూప్‌ ఏర్పాటు చేశాడు. ఇందులో బాధితురాలు, ఆమె భర్త కూడా సభ్యులుగా ఉన్నారు.

కాలేజీ రోజుల్లో సదరు యువతితో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి వాటిని ఆ ‘ఎంబీబీఎస్‌ గ్రూప్‌’లో పోస్ట్‌ చేశాడు. గ్రూప్‌ అడ్మిన్‌ ఎవరనేది సభ్యులు తెలియకుండా ఉండేందుకు కొత్త నంబర్‌తో దీనిని క్రియేట్‌ చేశాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు క్లాస్‌మేట్స్‌కు తెలిసిన తన పాత నెంబర్‌తో తనకు తననూ ఓ సభ్యుడిగా యాడ్‌ చేసుకున్నాడు.  


గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయడమే కాకుండా అందులో అభ్యంతరకరమైన తన భార్య ఫొటోలు, వీడియో లో పోస్ట్‌ చేయడంతో ఆమె భర్త షాక్ తిన్నాడు.  దీనిపై భార్యను నిలదీయడంతో ఇద్దరి గొడవలు జరిగాయి. ఈ విషయం తనకు ఏమీ తెలియదని, ఆ గ్రూప్‌ అడ్మిన్‌ ఎవరో కూడా తనకు తెలియదని భర్తకు చెప్పడంతో  ఆయన దీనిపై సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాన్ని పసిగట్టిన నిందితుడు ఇందుకు విని యోగించిన సిమ్‌కార్డును ధ్వంసం చేసి ఆధారాలు చిక్కకుండా చేయాలని భావించాడు. అయితే సాంకేతికంగా దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోహెబ్‌ అలీని అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios